2 రోజుల్లో పెళ్లి.. ఫైనాన్సియర్ల వేధింపులతో ఆత్మహత్య
TG: HYDలోని BN రెడ్డి నగర్‌లో విషాదం నెలకొంది. శ్రీకాంత్ అనే వ్యక్తి ఫైనాన్సియర్ల వద్ద రూ. 2లక్షలు అప్పుగా తీసుకున్నాడు. అతనికి పెళ్లి కుదిరిందని తెలుసుకుని, అప్పు తిరిగి ఇవ్వకపోతే ఇంటికి తాళం వేస్తామని ఫైనాన్సియర్లు బెదిరించారు. దీంతో మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా 2 రోజుల్లో శ్రీకాంత్ పెళ్లి ఉండగా ఇలా జరగడంతో తల్లిదండ్రులు విలపిస్తున్నారు.