యూరియా పంపిణీపై కలెక్టర్ ఆదేశాలు

కర్నూలు జిల్లాలో యూరియా పంపిణీ సక్రమంగా జరిగేలా చూడాలని, అక్రమాలకు పాల్పడే వారిపై కేసులు నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా ఆదేశించారు. బుధవారం ఆయన విడుదల చేసిన ప్రకటనలో, రెవెన్యూ అధికారులు, రైతు సేవా కేంద్రాలు, పాక్స్, ప్రైవేటు దుకాణాలను తనిఖీ చేసి, యూరియా ధరల నియమాలను పాటించాలని సూచించారు.