మద్యం మత్తులో భార్యను హత్య చేసిన భర్త
సూర్యాపేట జిల్లా మోతె మండలం విభలాపురంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే.. మద్యం మత్తులో ఉన్న భర్త తన భార్యను కర్రతో కొట్టి దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. దీంతో నిందితుడైన భర్తను అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘాతుకానిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.