VIDEO: 'నిండుకుండను తలపిస్తున్న రేజర్ల చెరువు'

KMM: సత్తుపల్లి మండలం రేజర్ల చెరువు వద్ద ఉన్న బతుకమ్మ ఘాట్‌ను బుధవారం ఎమ్మెల్యే మట్ట రాగమయి పరిశీలించారు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి చెరువు నిండి నిండుకుండలను తలపిస్తుందని ఎమ్మెల్యే చెప్పారు. చెరువు వద్ద ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు మట్టా దయానంద్ తదితరులు పాల్గొన్నారు.