విశాఖలో నకిలీ మద్యం తయారీ.. ఒకరు అరెస్టు

VSP: సీతంపేటలో నకిలీ మద్యం తయారు చేస్తున్న కట్టమూరి రామకృష్ణను శుక్రవారం రాత్రి ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పట్టుకున్నారు. అతని వద్ద నుంచి 70 నకిలీ మద్యం సీసాలు, 1.5lts హోమియోపతి స్పిరిట్, 225 వివిధ బ్రాండ్ల ఖాళీ మద్యం సీసాలు, 76 లిక్కర్ ప్యాకేజ్ కవర్ల లేబుల్స్ మూతలు స్వాధీనం చేసుకున్నామని ఎక్సైజ్ సూపరింటెండెంట్ ప్రసాద్ తెలిపారు.