విద్యార్థినిని సన్మానించిన కూడా ఛైర్మన్
హనుమకొండ డీసీసీ కార్యాలయంలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన తీగల సాయి శ్రేష్టితను డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి శాలువాతో సత్కరించారు. కేశవాపూర్ గ్రామానికి చెందిన ఆమె ఇంటర్ ఎంపీసీలో 1000కు 997 మార్కులు సాధించింది. పట్టుదలతో సాధించిన ఈ విజయం అభినందనీయమని, తోటి విద్యార్థులకు ఆదర్శమని ఆయన తెలిపారు. ఆమె ఉన్నత చదువులకు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.