యూనియన్ బ్యాంకులో అగ్నిప్రమాదం

యూనియన్ బ్యాంకులో అగ్నిప్రమాదం

KNR: కరీంనగర్ నగరంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్-2లో ఒక్కసారిగా మంటలు చెలరేగడం కలకలం రేపింది. గ్రౌండ్ ఫ్లోర్లోని ఒక గదిలో మంటలు వ్యాపించడంతో లోపల ఉన్న ఫర్నిచర్, రూఫ్ కప్పు పాక్షికంగా దగ్ధమయ్యాయి. అప్రమత్తమైన సిబ్బంది అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. కరీంనగర్, మానకొండూరు నుంచి వచ్చిన రెండు ఫైర్ ఇంజన్లు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చాయి.