చికిత్స పొందుతూ దిశ కానిస్టేబుల్ మృతి
విజయనగరం దిశ పోలీసు స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న కీలపర్తి నాగమణి విశాఖపట్నం అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున మృతి చెందింది. గత కొద్దిరోజులుగా అనారోగ్యానికి గురై విజయనగరంలో చికిత్స పొందుతూ, పరిస్థితి విషమించడంతో విశాఖకు తరలించారు. ఆమె సొంతగ్రామం ఎస్.కోట మండలం అలుగుబిల్లి గ్రామం ఆమెకు భర్త, ఇద్దరు కుమారులు ఉన్నారు.