'కేతగుడిపిలో సచివాలయం వెళ్లే రోడ్డు ఆక్రమణ'
ప్రకాశం: తర్లుపాడు మండలం కేతగుడిపి గ్రామంలోని సచివాలయం వెళ్లే రోడ్డు ఆక్రమణకు గురై, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారింది. అక్రమంగా నిర్మించిన షాపు ముందు నుంచి మహిళలు సచివాలయం వెళ్లాలంటే హడలిపోతున్నారు. ఆ షాపును అక్కడి నుంచి తొలగించి మరోచోట ఏర్పాటు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరిన పట్టి పట్టనట్టు వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు.