'ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలి'

'ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలి'

ASR: సమయపాలన పాటించాలని కొయ్యూరు ఎంపీడీవో జీడీవీ ప్రసాదరావు సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. బుధవారం ఆయన డౌనూరు సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా ఆయన సచివాలయంలోని రికార్డులను పరిశీలించారు. హాజరు పట్టీని తనిఖీ చేశారు. సచివాలయం ద్వారా ప్రజలకు అందుతున్న సేవలు గురించి ఆరా తీశారు. సచివాలయ సిబ్బంది ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు.