ఉపాధ్యాయుల సమస్యలపై ఏపీటీఎఫ్ పోరాటం
సత్యసాయి: ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఏపీటీఎఫ్ నిరంతర పోరాటం చేస్తోందని జిల్లా కార్యదర్శి చంద్ర తెలిపారు. పుట్టపర్తి మండలంలోని పాఠశాలల్లో గురువారం సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. డీఏ, పెండింగ్ పీఆర్సీ బకాయిల విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు హరిప్రసాద్, రాజశేఖర్, శివ, ప్రసాద్, రాము పాల్గొన్నారు.