తాండూరు మండల కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్‌గా మోర్ల సుధాకర్
MNCL: తాండూరు మండల కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్‌గా కన్నెపల్లి మండలంకు చెందిన జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి మోర్ల సుధాకర్‌ను పార్టీ అధిష్టానం నియమించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాండూరు మండలంలో పార్టీ బలోపేతం కోసం నాయకులు, కార్యకర్తలను కలుపుకుని తన శక్తివంచన లేకుండా కృషి చేస్తానని అన్నారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు శుభాకాంక్షలు తెలియజేశారు.