పాఠశాలకు వెళ్లాలంటే వాగు దాటాల్సిందే..

పాఠశాలకు వెళ్లాలంటే వాగు దాటాల్సిందే..

SRCL: వాగు దాటితేనే ఆ ఊరి పిల్లలకు చదువు. ప్రతిరోజు విద్యార్థులు చదువు కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కోనరావుపేట మండలంలోని వెంకట్రావుపేట, కొండాపూర్ గ్రామాల విద్యార్థులు మూలవాగు అవతల ఉన్న బావుసాయిపేట పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్నారు. వరద ఉద్ధృతికి ఏళ్ల క్రితం నాటి వంతెన కొట్టుకుపోగా, అధికారులు పట్టించుకున్న పాపాన పోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు.