వేములవాడలో వల్లభాయ్ పటేల్ వర్ధంతి కార్యక్రమం

వేములవాడలో వల్లభాయ్ పటేల్ వర్ధంతి కార్యక్రమం

SRCL: వేములవాడ పట్టణంలోని న్యూ అర్బన్ కాలనీ ప్రాథమిక పాఠశాలలో సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు విక్కుర్తి లక్ష్మీనారాయణ ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉక్కుమనిషి సమైక్యత శిల్పి పటేల్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.