VIDEO: భక్తజనంతో కిటకిటలాడుతున్న పుట్టపర్తి
సత్యసాయి: భగవాన్ శ్రీ సత్యసాయిబాబా శత జయంతి వేడుకల సందర్భంగా పుట్టపర్తి పట్టణం నేడు భక్తులతో సందడిగా మారింది. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు తరలిరావడంతో, ప్రశాంతి నిలయం పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. ప్రత్యేక దర్శనాలు, సేవా కార్యక్రమాలతో పట్టణమంతా ఆధ్యాత్మిక వాతావరణం, పండుగ శోభను సంతరించుకుంది.