బీఆర్ఎస్‌లో చేరిన నార్కట్‌పల్లి యువకులు
NLG: నార్కట్‌పల్లికి చెందిన పలువురు యువకులు కాంగ్రెస్ పార్టీ వీడి బీఆర్ఎస్‌లో చేరారు. మేడబోయిన రాంబాబు యాదవ్, మేడబోయిన నాగరాజు యాదవ్‌లతో పాటు పలువురు యువజన కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సమక్షంలో బుధవారం రాత్రి బీఆర్ఎస్‌లో చేరారు. గులాబీ కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు.