'దాతల సహకారం అభినందనీయం'
GNTR: గుంటూరు నగర ప్రజలకు ఆరోగ్యవంతమైన జీవనశైలిని ప్రోత్సహించే కార్యక్రమాలు చేపట్టడం సంతోషకరమని మేయర్ కోవెలమూడి రవీంద్ర తెలిపారు. కొరిటెపాడు వాకింగ్ ట్రాక్ అభివృద్ధి, నూతన జిమ్ పరికరాల కొనుగోలుకు వెంకటేష్ కన్‌స్ట్రక్షన్స్ అధినేత పులివర్తి శేషగిరిరావు, ప్రధాన్ హాస్పిటల్స్ సంయుక్తంగా మంగళవారం రూ.6 లక్షల విరాళం అందించారు.