నేడు దామగుండంలో టెంకాయల వేలంపాట: ఛైర్మన్
VKB: పూడూరు మండలం దామగుండం రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు టెంకాయల వేలంపాట ఇవాళ ఉదయం 9 గంటలకు గ్రామపంచాయతీ కార్యాలయంలో జరుగుతుందని ఆలయ కమిటీ ఛైర్మన్ శ్రీనివాస్ తెలిపారు. గ్రామ ప్రజలు వేలంపాటలో పాల్గొనాలని కోరారు. స్వామివారి బ్రహ్మోత్సవాలు ఈనెల 12 నుంచి 16 వరకు జరుగుతాయని వెల్లడించారు.