'ప్రజాశాంతికి విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు'

'ప్రజాశాంతికి విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు'

MNCL: ప్రజాశాంతికి విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని బెల్లంపల్లి రూరల్ CI హనోక్ రౌడీషీటర్లకు హెచ్చరికలు జారీ చేశారు. శనివారం రూరల్ పోలీస్‌ స్టేషన్ పరిధిలో ఉన్న రౌడీ షీటర్లకు కౌన్సెలింగ్‌ నిర్వహించారు. అసాంఘిక కార్యకలాపాలు కొనసాగించేవారిపై గట్టి నిఘా ఉంటుందని కౌన్సెలింగ్‌ చేశారు. ప్రతి ఒక్కరూ సత్ప్రవర్తనతో మెలగాలని CI సూచించారు.