పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన ఎస్పీ
VZM: జిల్లా ఎస్పీ ఏ.ఆర్ దామోదర్ రాజాం పోలీస్ స్టేషన్‌ను ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయనకు చీపురుపల్లి డీఎస్పీ, సీఐ పూల మొక్కను అందచేసి, స్వాగతం పలికారు. స్టేషన్ పరిసరాలను పరిశీలించి, సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం దస్త్రాలను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు.స్టేషన్‌లో నమోదు అవుతున్న కేసులపై ఆరా తీశారు.