ప్రభుత్వ వసతులను సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్

ప్రభుత్వ  వసతులను సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్

SRCL: ప్రభుత్వ రెసిడెన్షియల్ విద్యాలయాల్లో ప్రభుత్వం కల్పిస్తున్న వసతులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు. వేములవాడ పట్టణంలోని మహాత్మాజ్యోతి బాపూలే బాలికల రెసిడెన్షియల్ విద్యాలయంలో కలెక్టర్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యాలయం ఆవరణ, తరగతి గదులు, కిచెన్ లో ఆహార పదార్థాలను పరిశీలించారు.