వేతనదారులకు ఇన్సూరెన్స్ చేయించండి
SKLM: ఉపాధి వేతనదారులకు పీఎంజెవై ఇన్సూరెన్స్ చేయించాలని టెక్కలి ఏపీడి శైలజ అన్నారు. ఆమె మెలియాపుట్టి మండలంలోని ఉపాధి హామీ సిబ్బందితో మంగళవారం సమీక్షించారు. ఉపాధి హామీలో పనిచేస్తున్న వేతన దారులందరికి పీఎంజేవై ఇన్సూరెన్స్ క్షేత్రస్థాయి సిబ్బంది చేయించాలని అన్నారు. అదేవిధంగా పనుల వద్ద వేసవి జాగ్రత్తలు పాటిస్తూ పనులు చేయాలన్నారు.