మైదుకూరు హైవేపై రాంగ్ రూట్ డ్రైవింగ్‌కు చెక్

మైదుకూరు హైవేపై రాంగ్ రూట్ డ్రైవింగ్‌కు చెక్

KDP: మైదుకూరు హైవేపై వ్యతిరేక దిశలో ప్రయాణించడం వల్ల ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో, వాటి నివారణకు సూచిక బోర్డులు ఏర్పాటు చేశారు. ప్రమాదాలకు కారణమవుతున్న రాంగ్ రూట్ డ్రైవింగ్‌పై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. వాహనదారులు ట్రాఫిక్ నియమాలు తప్పనిసరిగా పాటిస్తూ సురక్షితంగా ప్రయాణించాలని మైదుకూరు అర్బన్ సీఐ కె. రమణా రెడ్డి సూచించారు.