పోస్టల్ బ్యాలెట్ కేంద్రాన్ని పరిశీలించిన అదనపు కలెక్టర్

పోస్టల్ బ్యాలెట్ కేంద్రాన్ని పరిశీలించిన అదనపు కలెక్టర్

KMM: గ్రామ పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లలో భాగంగా అదనపు కలెక్టర్ శ్రీజ శుక్రవారం ముదిగొండ మండల విద్యాశాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ కేంద్రాన్ని తనిఖీ చేశారు. పోలింగ్ ప్రక్రియ సజావుగా జరిగేందుకు చేపట్టిన ఏర్పాట్లను ఆమె క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం ఎన్నికల అధికారులు, సిబ్బందికి పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.