ఆర్థిక సాయం కోసం ఎదురు చూపు

ఆర్థిక సాయం కోసం ఎదురు చూపు

రంగారెడ్డి: యాచారం మండలం ధర్మన్నగూడ గ్రామానికి చెందిన నీల బాషయ్య (45) ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. నిరుపేద కుటుంబానికి చెందిన బాషయ్య ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇప్పటికే ఆస్పత్రిలో రూ. 4లక్షలు ఖర్చు కాగా వైద్యులు ఇంకా డబ్బులు కావాలి అనడంతో దాతల కోసం ఎదురు చూస్తున్నారు.