పిడుగుపాటుకు రైతు మృతి
GDWL: జిల్లాలోని రాజోలి మండలం నివాసి అయిన కురువ మద్దిలేటి (40) మంగళవారం పొలంలో పత్తి తీస్తుండగా పిడుగుపాటుకు గురై అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడికి భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. పత్తి తీస్తుండగా ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. రైతు మృతితో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.