VIRAL: ప్రతిభకు వైకల్యం అడ్డుకాదు

VIRAL: ప్రతిభకు వైకల్యం అడ్డుకాదు

ఒంటికాలిపై క్రికెట్ ఆడుతున్న ఓ బాలుడి వీడియో SMలో వైరల్ అవుతోంది. వైకల్యాన్ని లెక్కచేయకుండా క్రికెట్ పట్ల అతడు చూపుతున్న అంకితభావం నెటిజన్ల మనసు గెలుచుకుంది. బ్యాట్‌తో బంతిని బాదిన తర్వాత, ఒక చేతికర్ర సహాయంతోనే అతను వేగంగా పరుగులు తీస్తుండటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. 'సంకల్పం ఉంటే సాధించలేనిది ఏదీ లేదు' అని అతడు నిరూపించాడంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.