నిర్మాతకు పాట అంకితం చేసిన సుమ
ప్రియదర్శి, ఆనంది జంటగా నటించిన చిత్రం 'ప్రేమంటే'. నవనీత్ శ్రీరామ్ తెరకెక్కించిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీలో యాంకర్ సుమ కనకాల కీలక పాత్ర పోషించారు. ఈ నేపథ్యంలో తాజాగా HYDలో లవ్ ట్రాటర్ పేరుతో వేడుక నిర్వహించారు. ఇందులో సుమ ఈ మూవీ నిర్మాతకు ఓ పాటను అంకితం చేశారు. 'అగ్గిపుల్లలాంటి ఆడపిల్ల నీవు' అంటూ పాట పాడి సందడి చేశారు.