గతంలో పారిశుద్ధ్య కార్మికుడు.. నేడు ఉపసర్పంచ్

గతంలో పారిశుద్ధ్య కార్మికుడు.. నేడు ఉపసర్పంచ్

MDK: ఐదేళ్లుగా పారిశుద్ధ్య కార్మికుడు, ట్రాక్టర్ డ్రైవర్‌గా విధులు నిర్వహించిన యువకుడు ఉప సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. నార్సింగి మండలం శేరిపల్లికి చెందిన చెప్యాల విజయ్ కుమార్ గ్రామంలో రెండో వార్డులో పోటీ చేసి 36 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. దీంతో గ్రామంలో ఆదివారం జరిగిన ఉపసర్పంచ్ ఎన్నికల్లో విజయ్ కుమార్‌ను ఉపసర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.