కనుమ వేళ.. పాడిపంటల పూజ
SRPT: సంక్రాంతి సంబరాల్లో భాగంగా శుక్రవారం జిల్లా వ్యాప్తంగా కనుమ పండుగను రైతులు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఏడాది పొడవునా వ్యవసాయ పనుల్లో తమకు చేదోడుగా నిలిచిన పశువులకు కృతజ్ఞతగా పూజలు నిర్వహించారు. మూగజీవాలకు స్నానం చేయించి, కొమ్ములకు రంగులు అద్ది, పసుపు కుంకుమలతో అలంకరించి హారతి ఇచ్చారు. పాడిపంటలు సమృద్ధిగా ఉండాలని పూజలు నిర్వహించారు.