'సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి'
SRCL: బోయినపల్లి మండల పరిధిలోని రొసోయి కళశాలలో విద్యార్థులకు సైబర్ మోసాలపై ఎస్ఐ జునైద్ అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ సైబర్ భద్రతను వ్యక్తిగత బాధ్యతగా తీసుకోవాలన్నారు. అనుమానాస్పద లింకులు, OTPలు, బ్యాంక్ వివరాలు పంచుకోవద్దని సూచించారు. ముఖ్యంగా సామాజిక మాధ్యమాల ద్వారా వ్యక్తిగత సమాచారం, ఫోటోలను ఇతరులతో పెంచుకోకూడదన్నారు.