VIDEO: దేవాలయంలో దొంగలు.. సీసీ ఫుటేజ్‌లో రికార్డింగ్
NTR: నందిగామ పట్టణంలోని పాత బస్టాండ్ సమీపంలోని విగ్నేశ్వర స్వామి దేవాలయంలో దొంగలు బీభత్సం సృష్టించారు. దేవాలయ గేట్ల తాళాలను ఇనప రాడ్లతో పగలగొట్టి లోపలకు ప్రవేశించి హుండీని పగలగొట్టిన దృశ్యాలను ఆలయ ఈవో బయటపెట్టారు. సీసీ ఫుటేజ్‌లో పగలగొట్టిన దృశ్యాలను ఛైర్మన్ పోలీసులకు అందజేసి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు విచారణ చేపడుతున్నారు.