రాజవర్ధన్ రెడ్డి చిత్రపటానికి ఎమ్మెల్యే నివాళి
KRNL: టీడీపీ నేత రాజవర్ధన్ రెడ్డి 4వ వర్ధంతి సందర్భంగా కేడీసీసీ ఛైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి నివాసంలో ఇవాళ కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజవర్ధన్ రెడ్డి ప్రజాసేవలో చూపిన నిబద్ధత అందరికీ ఆదర్శమని, వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.