పెన్షన్ల తొలగింపుపై ఆందోళన చేపట్టిన CPM

SS: ముదిగుబ్బలో దివ్యాంగుల పెన్షన్ల తొలగింపుకు నిరసనగా సీపీఎం నాయకులు ఆందోళన చేపట్టారు. మండల కార్యదర్శి ఆటో పెద్దన్న మాట్లాడుతూ.. అనర్హులను గుర్తించే క్రమంలో అర్హులైన దివ్యాంగుల పెన్షన్లు ప్రభుత్వం తొలగించిందని విమర్శించారు. తొలగించిన పెన్షన్లను వెంటనే పునరుద్ధరించాలని వీఆర్వో రేవతికి వినతిపత్రం అందించారు. ఇందులో భాగంగా కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.