మెరుగైన వైద్య సేవల కోసం వైద్య శిబిరం
KNR: ఇల్లందకుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెగా ఉచిత వైద్య శిబిరాన్ని సర్పంచ్ దార సురేశ్ ప్రారంభించారు. మండలంలోని 18 గ్రామాల నుంచి వచ్చిన రోగులకు వైద్యులు పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు పంపిణీ చేశారు. మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మధుకర్ మాట్లాడారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ఈ మెగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.