'రాజు వెడ్స్ రాంబాయి' ట్రైలర్ రిలీజ్
ఈటీవీ విన్ నిర్మాణంలో యువ నటీనటులు అఖిల్, తేజస్విని జంటగా నటించిన మూవీ 'రాజు వెడ్స్ రాంబాయి'. ఈ నెల 21న రిలీజ్ కానున్న ఈ సినిమా ట్రైలర్‌ను నటుడు అడివి శేష్ తాజాగా విడుదల చేశాడు. ప్రస్తుతం ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. కాగా, గ్రామీణ నేపథ్యంలో సాగే కథాంశంతో రూపొందిన ఈ సినిమాను సాయిలు కంపాటి తెరకెక్కించాడు.