కానిస్టేబుల్‌పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి
CTR: కార్వేటినగరం మండలానికి చెందిన కానిస్టేబుల్‌పై దాడి చేసినట్టు తెలిసింది. ఇవాళ ఉదయం ఆయన తన భార్యను స్కూల్ వద్ద దింపి తిరిగి స్కూటర్‌పై వస్తున్న సమయంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అతన్ని అడ్డగించి కొట్టి గాయపరచినట్టు సమాచారం. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అతన్ని తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.