విద్యార్థిని అదృశ్యం.. కేసు నమోదు

GNTR: విద్యార్థిని అదృశ్యమైనట్లు గుంటూరులోని ఆరండల్పేట పోలీస్ స్టేషన్‌లో సోమవారం కేసు నమోదైంది. వెల్దుర్తి మండలం ఉప్పలపాడుకు చెందిన విద్యార్థిని ఆరండల్పేటలోని ఒక ప్రైవేటు హాస్టల్‌లో ఉంటూ కళాశాలలో ఇంటర్ చదువుతుంది. ఈనెల 6న ఎవరికీ చెప్పకుండా హాస్టల్ నుంచి వెళ్లిపోయింది. ఇప్పటి వరకు తిరిగిరాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.