VIDEO: ఎమ్మోనిపల్లిలో ఎల్లమ్మ బండారోత్సవాలు
NRPT: ధన్వాడ మండలం ఎమ్మోనిపల్లిలో ఎల్లమ్మ బండారోత్సవాలు వైభవంగా నిర్వహించారు. గోటూరు నుంచి 33 కుటుంబాల భక్తులు తరలివచ్చి అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. డప్పు మేళాలు, బండారు చల్లుకోవడంతో గ్రామంలో ఉత్సాహం నెలకొంది. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సచిన్, మాజీ ఎంపీటీసీ శ్రీనివాసులు, పూజారి మల్లప్ప తదితరులు పాల్గొన్నారు.