VIDEO: గంగవరం పోర్టు వద్ద రోడ్డు ప్రమాదం

VIDEO: గంగవరం పోర్టు వద్ద రోడ్డు ప్రమాదం

VSP: గంగవరం పోర్టు నుంచి ఆదివారం బయలుదేరిన ట్రక్కు బీహెచ్‌పీవీ సమీపంలో కారును తప్పించబోయి ముందున్న వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ట్రక్కు ముందు భాగం పూర్తిగా ధ్వంసమై, డ్రైవర్ కేబిన్‌లో ఇరుక్కుపోయాడు. వెంటనే స్పందించిన ట్రాఫిక్ కానిస్టేబుల్ డ్రైవర్‌ను బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రాంతంలో తరచూ ప్రమాదాలు జరుగుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.