జానపద కళాకారులకు డ్రెస్సులు పంపిణీ
VZM: అంతరించిపోతున్న జానపద కళలను నేటి తరానికి అందించాలని గిడుగు రామ్మూర్తి తెలుగు భాష, జానపద కళా పీఠం అధ్యక్షుడు బద్రి కూర్మారావు అన్నారు. స్థానిక అష్టలక్ష్మి దేవాలయంలో చెక్కభజన ప్రదర్శించిన పిల్లలకు, గురువు మక్కువ మారినాయుడు బృందానికి కావలసిన డ్రస్సులు, కండువాలు, చెక్కలు మొదలగు అలంకరణ సామాగ్రిని అందజేశారు.