రైలు ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి

రైలు ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి

ATP: గుంతకల్లు-నంచర్ల రైల్వే స్టేషన్ల మధ్య ఓ గుర్తుతెలియని వ్యక్తి రైలులో నుంచి జారిపడి మృతి చెందినట్లు జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ నాగరాజు తెలిపారు. ఈ ఘటన శనివారం రాత్రి చోటుచేసుకుంది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుని వివరాల కోసం పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.