అధ్వానంగా తాగునీటి కుళాయి

SKLM: ఆమదాలవలస మండలం దూసి గ్రామం కుమ్మరి వీధిలో మంచినీటి కుళాయి చుట్టూ మురుగునీరు నిల్వ ఉంటుందని స్థానికులు ఆదివారం తెలిపారు. ఆర్ అండ్ బీ రోడ్డు కింద నుంచి మురుగునీరు వెళ్లేందుకు అవకాశం ఉన్నప్పటికీ అందులో మట్టి పేరుకుపోవడంతో ఈ సమస్య ఏర్పడిందన్నారు. ఫలితంగా మంచినీళ్లు పట్టుకునేందుకు వెళితే మురుగునీటి వాసనతో అవస్థలు పడుతున్నట్లు తెలిపారు.