రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే

రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే

NRPT: రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే చిట్టెం పర్ణిక రెడ్డి అన్నారు. బుధవారం మరికల్ మండలం తిలేరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. సన్న రకం వరి ధాన్యానికి ప్రభుత్వం రూ. 500 బోనస్ ఇస్తుందని అన్నారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా కొనుగోళ్లు చేయాలని నిర్వాహకులకు సూచించారు.