తాగి రాపిడో ఎక్కిన యువతి.. నెటిజన్లు ఫైర్

తాగి రాపిడో ఎక్కిన యువతి.. నెటిజన్లు ఫైర్

మద్యం తాగి, బైక్ మీద నుంచి పడిన యువతి వీడియో నెట్టింట వైరలవుతోంది. ఢిల్లీలోని ఓ నైట్ క్లబ్‌లో మద్యం తాగిన ఆమె రాపిడో బైక్ బుక్ చేసుకుంది. బైక్‌పై కూర్చున్న వెంటనే మద్యం మత్తులో ఒక్కసారిగా కిందకు జారిపోయింది. రాపిడో కెప్టెన్ అప్రమత్తంగా ఉండడంతో ఆమెకు ఎలాంటి గాయాలు కాలేదు. అయితే స్పృహ కోల్పోయేంతగా తాగడం ఎందుకంటూ ఆమెపై నెటిజన్లు మండిపడుతున్నారు.