ఉమ్మడి జిల్లాకు 2,638 టన్నుల యూరియా

KMM: ఉమ్మడి ఖమ్మం జిల్లాకు 2,638.44 టన్నుల యూరియా గూడ్స్ వ్యాగన్ల ద్వారా చేరుకుంది. చింతకాని మండలం పందిళ్ల పల్లిలోని రేక్ పాయింట్ వద్దకు వచ్చిన యూరియాను ఖమ్మం జిల్లాకు 1,538.44 టన్నులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు 1,000 టన్నులు, సీఆర్పీ ఖమ్మంకు 100 టన్నుల చొప్పున బదిలీ చేసినట్లు రేక్ పాయింట్ టెక్నికల్ అధికారి పవన్ కుమార్ తెలిపారు.