కృష్ణా నదికి వరద.. ఎమ్మెల్యే హెచ్చరికలు

ఎన్టీఆర్: కృష్ణానదికి 3 లక్షల క్యూసెక్కులకు పైగా వరద వచ్చే అవకాశం ఉందని మైలవరం MLA వసంత వెంకట కృష్ణప్రసాద్ బుధవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. లోతట్టు, లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. పులిచింతల నుంచి విడుదలైన నీరు ప్రకాశం బ్యారేజీకి చేరుతోందని, అధికారులు, NDRF బృందాలు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు.