గొర్రెల పంపిణీ స్కామ్‌లో కొనసాగుతున్న ED విచారణ

గొర్రెల పంపిణీ స్కామ్‌లో కొనసాగుతున్న ED విచారణ

TG: గొర్రెల పంపిణీ కుంభకోణం కేసులో ED విచారణ కొనసాగుతోంది. గొర్రెల పంపిణీ స్కామ్ బాధితులు ED కార్యాలయానికి చేరుకున్నారు. ఏపీ రైతులకు ఇవ్వాల్సిన రూ.2 కోట్లను మధ్యవర్తులు ఎగవేసినట్లు అధికారులు గుర్తించారు. గుంటురు, పల్నాడు జిల్లాలకు చెందిన రైతుల నుంచి వాంగ్మూలాన్ని రికార్డు చేయనున్నట్లు తెలిపారు. పశుసంవర్ధక శాఖ OSDగా పని చేసిన కళ్యాణ్ ఇంట్లో కీలక ఆధారాలు స్వాధీనం చేసుకున్నారు.