VIDEO: అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా విజిలెన్స్ కమిటీ

VIDEO: అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా విజిలెన్స్ కమిటీ

ELR: కామవరపుకోట మండలం కొండగూడెం అంగన్వాడి కేంద్రాన్ని జిల్లా విజిలెన్స్ కమిటీ సభ్యుడు డా. వంటిపల్లి విజయకృష్ణ గురువారం ఆకస్మికంగా సందర్శించారు. ఉదయం 11:30 గంటలకు కేంద్రాన్ని పరిశీలించిన సమయంలో అక్కడ అంగన్వాడి వర్కర్ గానీ, పిల్లలు గానీ లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లలకు ఇవ్వాల్సిన గుడ్లు, పాలు పంపిణీ చేయకపోవడం, వంట కూడా చేయకపోవడంతో నిలదీశారు.