పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులు

WGL: పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. టాస్క్‌ఫోర్స్ సీఐ రాజు ఆధ్వర్యంలో సోమవారం ఏనుమాముల పోలీస్ స్టేషన్ పరిధిలో సర్దార్ పేట్ గ్రామంలో పేకాడుతుండగా నలుగు వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారి నుంచి 12,970 నగదు, నాలుగు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు నిమిత్తం స్థానిక పోలీసులకు అప్పగించినట్లు తెలిపారు.